రాజాం పట్టణ శివారులో శేషగిరిరావు ఇంట్లో 27 తులాల బంగారం చోరీ కేసులో ఓ నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో డీఎస్పీ రాఘవులు వివరాలు వెల్లడించారు.
బలిజిపేట మండలం అరసాడ పనుకువలస గ్రామానికి చెందిన గుజ్జల సుధాకర్ ను అరెస్టు చేసి 10 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు.