గత వైసీపీ పాలనపై మంత్రి పార్థసారథి కీలక వ్యాఖ్యలు చేశారు. 'గత ఐదేళ్లు అప్రజాస్వామిక ప్రభుత్వం నడిపారు. ఇప్పుడేమో ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడుతున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తాననుకోవడం జగన్ అవివేకం. జగన్ సాగించిన అరాచకం దేశమంతా చూసింది. తప్పు చేసిన నేతలను మందలించకపోగా సమర్థించడం జగన్‌కే చెల్లింది' అంటూ మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు.