ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలే తమ నిజమైన బలం అని ఢిల్లీ సీఎం అతిషీ ఎక్స్ వేదికగా అన్నారు. ‘స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లయినా ఏప్రభుత్వం చేయలేని పనులు గత 10 ఏళ్లలో ఢిల్లీలో జరిగాయి.
కేజ్రీవాల్ సీఎం అయిన తర్వాత నిజాయితీగా పనిచేసిన మీలాంటి అంకితభావం గల కార్యకర్తల వల్లనే ఇదంతా జరిగింది. మరోసారి కేజ్రీవాల్‌ను ఢిల్లీ సీఎంని చేయాలి.’ అని అన్నారు.