ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2023 ఏప్రిల్ తేదీతో మాజీ కార్యదర్శి ఈ మెమో జారీ చేసినట్లుగా ప్రచారం

national |  Suryaa Desk  | Published : Fri, Nov 08, 2024, 04:37 PM

విదేశాల్లోని భారత దౌత్యవేత్తలకు కేంద్ర ప్రభుత్వం రహస్యంగా ఓ మెమోను ఇచ్చిందని వస్తున్న వార్తలపై విదేశాంగ శాఖ స్పందించింది. కెనడాలోని ఖలిస్థాన్ వేర్పాటువాదులను అడ్డుకోవడానికి అధికారులు ఓ దళాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించినట్లుగా ఓ మెమో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. ఇది భారత విదేశాంగ శాఖ పేరుతో ఉందంటూ, నెట్టింట వైరల్‌గా మారింది. 2023 ఏప్రిల్ తేదీతో ఉన్న ఆ మెమోను మాజీ విదేశాంగ కార్యదర్శి వినయ్ కత్రా జారీ చేసినట్లుగా ఉంది.కెనడాలోని ఖలిస్థాన్ ఉగ్రవాదులను అడ్డుకునేందుకు భారతీయ మూలాలున్న వారితో బలమైన దళాన్ని ఏర్పాటు చేయాలని అందులో ఉంది. అయితే ఈ మెమో నకిలీది అని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.ఆ మెమో నకిలీదని... అలాంటి మెమో ఏదీ కేంద్రం జారీ చేయలేదని స్పష్టం చేసింది. భారత దౌత్యవేత్తలకు హింసాత్మక నేరాలను అంటగడుతూ తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఖలిస్థానీ సానుభూతిపరుడు నిజ్జర్ హత్య అంశంలో భారత్-కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఈ సీక్రెట్ మెమో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com