ఎన్నికల్లో ఎలా అక్రమాలు చేయాలో జగన్‌కు తెలిసినట్లు మరెవరికీ తెలియదని తెదేపా ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విమర్శించారు. బ్యాలెట్ పద్ధతిలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు ఆయన ఎందుకు దూరంగా ఉంటున్నారని ప్రశ్నించారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో భూమిరెడ్డి మాట్లాడారు. గౌతమ్‌రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించి ఎందుకు వెనక్కి తగ్గారని నిలదీశారు. ఎన్నికల్లో పాల్గొనకుండా, అసెంబ్లీకి రాకుండా జగన్‌కు రాజకీయ పార్టీ ఎందుకని మండిపడ్డారు. పులివెందులలో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించలేని ఆయనకు జీతమెందుకన్నారు. వెంటనే రాజీనామా చేస్తే.. పులివెందులకు మరో ఎమ్మెల్యే వస్తారని వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోవడం సిగ్గుచేటని భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి దుయ్యబట్టారు.