ప్రభుత్వ ఆదేశాల మేరకు సంక్షేమ ఫలాలు తప్పకుండా రావాలంటే ఆధార్, బ్యాంక్ అకౌంట్ లింక్ తప్పనిసరిగా ఉండాలని శ్రీకాకుళం డివిజన్ ఐపీపీబీ అధికారి షరీఫ్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు.
దీనిలో భాగంగా గ్రామంలోని పోస్ట్ ఆఫీసు సంప్రదించాలన్నారు. దీని కోసం పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకుని, సంక్షేమ ఫలాలు నేరుగా పోస్ట్ ఆఫీసుల్లోనే పొందవచ్చని తెలిపారు.