శింగనమల నియోజకవర్గం పరిధిలోని పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను నియోజవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు అందించారు. నియోజవర్గ వ్యాప్తంగా రూ. 634089 ల చెక్కులను అందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రావణి శ్రీ గారు మాట్లాడుతూ వివిధ అనారోగ్య సమస్యలతో,అంతేగాకుండా ప్రమాదాలలో గాయపడి మెరుగైన వైద్యం పొందెందుకు అప్పులు చేసి ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక వరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్న, పేదలను ఆదుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కి ఎమ్మెల్యే శ్రావణి శ్రీ గారు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు,కూటమి శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు