కార్తీక మాసంలో వచ్చే సోమవారాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా ఈ నెలలో మాత్రమే వచ్చే కోటి సోమవారానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. కార్తీక మాసంలో సప్తమి తిథి, శ్రవణ నక్షత్రం కలిసి వస్తే దాన్ని కోటి సోమవారం అంటారు. అయితే ఈ కోటి సోమవారం అనేది సోమవారం నాడే రావాలనే నిబంధన ఏం లేదు. అరుదుగా వచ్చే కోటి సోమవారం, కార్తీక సోమవారం కలిసొస్తే అద్భుతమైన విశేషమని పండితులు చెబుతున్నారు. కోటి సోమవారం రోజున దానధర్మాలు, ఉపవాస దీక్ష చేయడం వల్ల కోటి రెట్ల ఫలితం ఉంటుంది.