ప్రముఖ టెక్ సంస్థ కాగ్నిజెంట్ తమ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. వర్క్ ఫ్రం హోంకు స్వస్తి పలుకుతున్నట్లు, ఇక నుంచి ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీస్‌కు రావాల్సిందేనని కంపెనీ సీఈవో రవి కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ మేరకు ఉద్యోగులకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందించారు. భారత్‌లో ఈ సంస్థ అతిపెద్ద కార్యాలయాలు, 2.45 లక్షల మంది ఉద్యోగులను కలిగివుంది.