తెలియని ప్రదేశాలకు వెళ్లాలన్నా, షార్ట్‌కట్ రూట్స్‌లో ప్రయాణించాలన్నా వెంటనే గుర్తుకొచ్చేది గూగుల్ మ్యాప్స్. అత్యంత ప్రజాదరణ పొందిన యాప్ తన సేవల్ని మరింత విస్తరిస్తోంది.
ఇప్పటికే వాట్సప్ అవసరం లేకుండానే రియల్ టైమ్ లొకేషన్ షేరింగ్, ఫ్యూయెల్ సేవింగ్ వంటి ఫీచర్లను తీసుకొచ్చిన గూగుల్ మ్యాప్స్.. తాజాగా లాక్ స్క్రీన్‌పైనే లొకేషన్ కనిపించే సదుపాయాన్ని యూజర్లకు పరిచయం చేసింది.