దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ట్రేడింగ్‌లో దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ 1,000 పాయింట్లకు పైగా పెరిగి 73,574.02 వద్ద, నిఫ్టీ 300 పాయింట్లు పుంజుకొని 22,304 దగ్గర ఆల్‌టైం రికార్డును నమోదు చేశాయి . సెన్సెక్స్‌లో హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, సన్‌ఫార్మా, విప్రో షేర్లు మాత్రమే నష్టాల్లో ఉన్నాయి. టాటా స్టీల్, టైటన్, మారుతీ, పవర్‌గ్రిడ్ షేర్లు అత్యధికంగా లాభపడుతున్న జాబితాలో ఉన్నాయి.