ఉల్లిగడ్డతో ఎన్ని లాభాలు ఉన్నాయో దీనికి మించి ఉల్లి ఆకులలో ఉన్నాయి. అందుకే వంటలో ఉల్లి ఆకులను వేస్తారు. ఉల్లి ఆకుతో బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. ఉల్లి ఆకులలో ఫైబర్, విటమిన్స్, ఖనిజాలు, మెగ్నీషియం, పొటాషియం, సల్ఫర్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి ప్రాణాంతక వ్యాధి అయిన పేగు క్యాన్సర్, మలబద్ధకం, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు ఉన్నవారు ప్రతీరోజూ తమ ఆహారంలో ఉల్లి ఆకులను ఉపయోగించాలి.
జామ ఆకులతో బోలెడు ప్రయోజనాలు:
"పేదవాడి ఆపిల్‌గా జామకాయను పిలుస్తాం". జామ కాయ తింటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో, అంతకన్నా ఎక్కువ ఆకులలో ఉన్నాయి. ఆకులను తినడం వలన మధుమేహం నియంత్రణలో ఉంటుంది. జామ ఆకులతో జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు. గుప్పెడు జామ ఆకుల్ని నీళ్లలో 20 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత వాటిని వడకట్టి ఆ నీళ్లలో గోరింటాకు, మందార ఆకు ముద్దను కాసేపు నానబెట్టి తలస్నానం చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది."