సపోటా పండును ఇష్టపడని వారు ఉండనే ఉండరు. ఎందుకంటే తీయగా ఒక రకమైన రుచిని అందిస్తుంది. శరీరానికి శక్తిని ఇచ్చే గ్లూకోజ్ సపోటాలో సమృద్దిగా కలిగి ఉంటుంది. సపోటాలోని యాంటీఆక్సిడెంట్లు, పీచు, పోషకాలు క్యాన్సర్ నుంచి రక్షణ కల్పించడంలో దోహదపడతాయి. సపోటాలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. ఇది వృద్ధాప్యంలో కూడా కంటి చూపును మెరుగుపరుస్తుంది.
ఈ పండు తింటే ఎన్ని లాభాలో..
బొప్పాయిని తీసుకోవడం వలన అద్భుతమైన ఫలితాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. బొప్పాయి విశిష్టత గురించి చాలా మందికి తెలియదు. బొప్పాయిని తినడం వలన గుండె సంబంధిత వ్యాధులను దూరం చేసుకోవచ్చు. అంతేగాకుండా ఇందులో కేలరీలు తక్కువగా ఉండటం కారణంగా ఈజీగా బరువు తగ్గుతాము. బొప్పాయిలో ఎంజైమ్ ఉండటం చేత జీర్ణవ్యవస్థను బాగా పనిచేసేలా చేస్తుంది.