బిజినెస్ ప్రాసెస్ ఔట్‌సోర్సింగ్ రంగ ఉద్యోగులపై జనరేటివ్ కృత్రిమ మేధ ప్రభావం అధికంగా ఉంటుందని ఐటీ పరిశ్రమ సంఘం నాస్కామ్ ఛైర్మన్ రాజేశ్ నంబియార్ తెలిపారు.
సాఫ్ట్‌వేర్ సేవల్లో పనిచేస్తున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. బీపీఓ ఉద్యోగాలను మాత్రమే ఏఐ వేగంగా భర్తీ చేసే అవకాశం ఉందని తెలిపారు. రోజువారీ విధుల్లో ఏఐని ఉపయోగించడం అలవాటు చేసుకోని వారి ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందని నంబియార్ స్పష్టం చేశారు.