హైదరాబాద్‌కు చెందిన స్టార్ షట్లర్ బి సాయి ప్రణీత్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని ఆయన నిన్న ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. 31 ఏళ్ల సాయి ప్రణీత్ అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు ఎన్నో పతకాలు సాధించాడు. 2019లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని సాధించాడు. టోక్యో ఒలింపిక్స్ తర్వాత గాయాలతో బాధపడుతున్న ప్రణీత్ తన సుదీర్ఘ కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశాడు.
ప్రణీత్ తన కెరీర్లో సింగపూర్ ఓపెన్, కెనడా ఓపెన్, థాయ్‌లాండ్ ఓపెన్ టైటిళ్లను గెలుచుకున్నాడు. తన కెరీర్ పట్ల సంతృప్తిని వ్యక్తం చేసిన ప్రణీత్.. ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం సాధించలేకపోయానని బాధపడ్డాడు. ప్రణీత్‌ను భారత ప్రభుత్వం 2019లో అర్జున అవార్డుతో సత్కరించింది. తన రిటైర్మెంట్ సందేశంలో ప్రణీత్ తనకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.