కరోనా రాకతో చాలా మంది వేడి నీళ్లు తాగడం అలవాటుగా చేసుకున్నారు. గొంతులో ఉండే ఇన్ఫెక్షన్ పోవడానికి వేడి నీళ్లు ఉపయోగపడతాయని చెప్పడంతో అనేక మంది హాట్ వాటర్ తీసుకోవడం మొదలు పెట్టారు. అయితే ఎక్కువ వేడి నీళ్లు తాగితే మొదటికే ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు వైద్యనిపుణులు.
ఎక్కువ వేడి నీళ్లను క్రమంగా తీసుకోవడం ద్వారా నరాలు చిట్లి పోయే ప్రమాదం ఉందని, ఇలా పదే పదే వేడి నీళ్లు తాగడం వల్ల తల నొప్పి కూడా వస్తుందని చెబుతున్నారు. బ్లడ్ వెస్సెల్స్ సెల్స్ పై ప్రెషర్ పడుతుందని బ్లడ్ వాల్యూమ్ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కిడ్నీలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉండటంతో వేడి నీటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.