వేసవి వస్తే చాలు ముప్పు తిప్పలు పడాల్సిందే. బయటికి వస్తే చల్లని పానీయాలను తాగుతూ ఉంటాం. మాటిమాటికీ అలసటకు గురవుతూ ఉంటాం. అలాంటప్పుడు బార్లీ నీళ్లు తాగితే అలసట తీర్చుకోవటంతో పాటు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. బార్లీని మిక్స్ చేసిన నీళ్లు, జ్యూస్ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బీపీ, షుగర్ కంట్రోల్‌లో ఉంటాయి.
వెల్లుల్లితో రోగాలు మాయం..
ఆయుర్వేదంలో వెల్లుల్లికి చాలా ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు వెల్లుల్లితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. దీనిలోని పోషకాల వల్ల వృద్ధాప్య లక్షణాలను నియంత్రించవచ్చు. ఎముకలకు పటిష్టత చేకూరుతుంది. పరగడుపున వెల్లుల్లి తినడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారికి ఉపశమనం లభిస్తుంది. కడుపు సంబంధిత సమస్యలు దరిచేరవు. వెల్లుల్లి రెమ్మల్ని పరగడుపున తీసుకోవడం వల్ల బ్లడ్ క్లాటింగ్ ముప్పు తొలగిపోతుంది. చెడు కొలెస్ట్రాల్ నిర్మూలించబడుతుంది.