ముంబై వేదికగా ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది. సరికొత్తగా ఐపీఎల్ తరహాలో టీ-10 టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రేక్షకుల ముందుకు రానుంది. వీధుల్లో టెన్నిస్ బాల్‌తో ఆడే ఆటగాళ్ల తో మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది. హైదరాబాద్ టీమ్‌ని హీరో రామ్ చరణ్ సొంతం చేసుకున్నారు. లీగ్ లో భాగం అయిన అక్షయ్ కుమార్ (శ్రీనగర్), హృతిక్ (బెంగళూరు), అమితాబ్(ముంబై), సూర్య (చెన్నై), సైఫ్ అలీఖాన్, కరీనా (కోల్కత్తా) ఉన్నాయి. కోర్ కమిటీ మెంబర్ గా సచిన్ టెండూల్కర్ ఉన్నారు.