దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్ 57 పాయింట్ల లాభంతో 74,143 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 15 పాయింట్లు లాభపడి 22,489 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.83 వద్ద ప్రారంభమైంది. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, SBI, పవర్‌గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, HDFC బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.