వేసవిలో చాలా మంది బాడీ కూల్ గా ఉండాలని మజ్జిగను తాగుతూ ఉంటారు. వేసవిలో ఫిట్, హైడ్రేటెడ్ గా ఉండాలంటే మజ్జిగ తాగితే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మజ్జిగ జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని, అంతేగాక క్యాన్సర్, అధిక కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో మజ్జిగ బాగా ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు. మజ్జిగ తాగితే మలబద్ధకం వంటి సమస్యలు కూడా దరిచేరవని అంటున్నారు.
దానిమ్మతో అనారోగ్య సమస్యలకు చెక్:
ప్రతి పండు శరీరానికి ఆరోగ్యకరమే. పండ్లు తినడం వలన మనిషి యాక్టివ్ గా ఉండడమే కాకుండా ప్రతి రోజూ తన పనిని తాను సునాయాసంగా చేసుకుంటాడు. దానిమ్మ వల్ల కలిగే హెల్త్ బెన్‌ఫిట్స్ బోలెడు ఉన్నాయి. ముఖ్యంగా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. డయాబెటిస్ నియంత్రణలో ఉంచుటుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కిడ్నీల ఆరోగ్యం మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు.