ఈ మధ్యకాలంలో చాలా మంది ఆరోగ్యంపై దృష్టి పెడుతున్నారు. ఉదయాన్నే జ్యూస్‌లు, మొలకెత్తిన విత్తనాలు తినడం స్టార్ట్ చేశారు. అయితే గర్భిణులు మొలకెత్తిన గింజలను పచ్చిగా తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. మొలకెత్తిన గింజల్లో క్రిములుంటాయి కాబట్టి ఉడికించి తీసుకోవాలి. వీటిలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే విటమిన్లు గర్భిణుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని వైద్యులు చెబుతున్నారు.
'వారికి టైప్-2 మధుమేహ ముప్పు
రోజులో కేవలం మూడు నుంచి అయిదు గంటలు మాత్రమే నిద్రించేవారికి టైప్-2 మధుమేహ ముప్పు ఎక్కువగా ఉంటుందని స్వీడన్ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పండ్లు, కూరగాయలు, ముతక ధాన్యాలు తినటం వల్ల మధుమేహ ముప్పు తగ్గినా, అరకొర నిద్రతో ఆ ప్రయోజనం నశిస్తుందని తెలిపారు. రోజుల్లో కనీసం ఆరు గంటల నిద్ర తప్పనిసరని పేర్కొన్నారు. 5 లక్షల మంది జన్యు సమాచారాన్ని పదేళ్లపాటు విశ్లేషించి ఈ నిర్ధారణకు వచ్చినట్లు వెల్లడించారు.