జంక్ ఫుడ్స్ తో చాలా మంది విపరీతమైన బరువు పెరిగారు. బరువు తగ్గేందుకు నానా తిప్పలు పడుతున్నారు. బరువు తగ్గాలనుకునేవారు రాత్రి 8 గంటల తర్వాత ఈ ఫుడ్స్ తీసుకుంటే సులభంగా బరువు తగ్గవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నానపెట్టిన బాదం, కోడిగుడ్డు, పీనట్ బటర్, ఓట్స్, బ్రౌన్ బ్రెడ్, అరటిపండ్లు రాత్రి 8 తర్వాత తింటే బరువు తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు.
నిద్రలేమి కారణంగా అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని అందరికీతెలుసు. సరిపడా నిద్ర లేకపోతే డయాబెటిస్ వచ్చే అవకాశం ఉందని తాజాగా ఓ అధ్యయనంలో బయటపడింది. జీవనశైలి ఎంత బిజీగా ఉన్నప్పటికీ శరీరానికి సరిపడా నిద్ర ఎంతో అవసరమని వైద్యులు అంటున్నారు. IT కంపెనీలలో నైట్ డ్యూటీలు చేసే వ్యక్తులకు 7 గంటల నిద్ర అవసరమని చెబుతున్నారు. ఆరోగ్యకరమైన జీవితం కోసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.