మాంసాహారం కంటే శాకాహారం తిన్నవాళ్లే యాక్టివ్‌గా ఉన్నారు. అయితే ఎక్కువ మంది ప్రజలు శాకాహారాన్ని ఇష్టపడతారు. ఈ శాకాహారంలో అనేక రకాల కూరగాయలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా బచ్చలికూరలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్, గుండె సంబంధిత సమస్యలు, టైప్ 2 డయాబెటిస్ ను నివారించడంలో సహాయపడతాయి. క్రూసిఫెరస్ వెజిటేబుల్ ఇది క్యాన్సర్ తో పోరాడటానికి సహాయపడుతుంది.
బరువు తగ్గాలంటే ఈ టైం లో తినాలి
జంక్ ఫుడ్స్‌తో చాలా మంది విపరీతమైన బరువు పెరిగారు. అయితే బరువు తగ్గేందుకు నానా తిప్పలు పడుతున్నారు. అయితే బరువు తగ్గాలనుకునేవారు రాత్రి 8 గంటల తర్వాత ఈ ఫుడ్స్ తీసుకుంటే సులభంగా బరువు తగ్గవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నానపెట్టిన బాదం, కోడిగుడ్డు, పీనట్ బటర్, ఓట్స్, బ్రౌన్ బ్రెడ్, అరటిపండ్లు రాత్రి 8 తర్వాత తింటే బరువు తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు.