ప్రతి రోజూ ఏ సమయంలో నీరు తాగితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం. ఉదయం పూట నీరు తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. ఉపవాసం ముగిసిన తర్వాత నీరు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్తాయి. శరీరానికి శక్తి అందుతుంది. వ్యాయామం చేయడానికి ముందు నీరు తీసుకోవడం వల్ల అలసట, కండరాల తిమ్మిర్లు తగ్గుతాయి.
చికెన్ లో ఏ పార్ట్ తింటే మంచిదో తెలుసా: ఎక్కువగా చికెన్ తినడం అంటే చాలామంది ఇష్టపడతారు. కానీ, చికెన్ లో ఏ పార్ట్ తింటే మంచిదో తెలియదు. ముఖ్యంగా చికెన్ స్కిన్ తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. చికెన్ తోలులో ఉండే కేలరీలు అధిక రక్తపోటుకు దారి తీస్తాయి. చికెన్ బ్రెస్ట్, తొడ తినడం మంచిది. బ్రెస్ట్ లో ప్రోటీన్లు ఎక్కువగా ఉండి బరువును కంట్రోల్ చేస్తాయి. చికెన్ తొడలో ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. చికెన్ తొడను గ్రిల్ చేసి తినడం మేలని చెబుతున్నారు.