టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టు మూడో రోజు ఆట ప్రారంభమైంది. ధర్మశాలలో భారత్ 473/8 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం ఆట ప్రారంభించింది. 124.1 ఓవర్లలో 477 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ తన రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది.
దూకుడుగా ఆడుతున్న బెయిర్స్టోక్కి భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ క్యాచ్ ఇచ్చాడు. అతడిని వికెట్ల ముందు దొరకబుచ్చుకుని పెవిలియన్ బాట పట్టాడు. 31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 39 పరుగులు చేసిన బెయిర్ స్టో రివ్యూకు వెళ్లగా.. ఫలితం అతనికి అనుకూలంగా రాలేదు. స్కోరు: 94-4(18). బెన్ స్టోక్స్ క్రీజులోకి వచ్చాడు.