ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా కాళ్ళ నొప్పుల సమస్యలు విపరీతంగా వస్తున్నాయి. నివేదికల ప్రకారం పురుషుల కంటే మహిళల్లో, అధిక బరువు ఉన్నవారిలో కీళ్లనొప్పులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కీళ్ల నొప్పులు రాకుండా ఉండటానికి కూరగాయలు, పండ్లు, పెరుగు, బీన్స్, చేపలు, ఆలివ్ నూనెలను తినాలని నిపుణులు చెబుతున్నారు.
చర్మ సౌందర్యం కోసం బొప్పాయి మాస్క్:
బొప్పాయి మాస్క్ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి సహాయపడుతుంది. చర్మానికి విటమిన్ C అందించడంలో దోహదపడుతుంది. బొప్పాయి మాస్క్‌ను తయారు చేయడానికి ముందుగా బొప్పాయిని ముక్కలుగా చేయాలి. ఆ ముక్కలను పేస్ట్‌గా చేయాలి. దీన్ని మీ ముఖ చర్మంపై అప్లై చేసి 20 నిమిషాలు అలాగే ఉంచాలి. గోరువెచ్చని నీటితో కడిగి ఆరబెడితే చర్మం కాంతివంతంగా ఉంటుంది.