పండ్లు నేరుగా తింటే బెటరా.? జ్యూస్ చేసి తాగితే మంచిదా.? అనే విషయాన్ని తెలుసుకుందాం. ప్యాకింగ్ చేసిన జ్యూస్ లు తాగడం వల్ల మెదడుకు సంబంధించిన సమస్యలు వచ్చే ప్రమాదముందని వైద్యులు సూచిస్తున్నారు. అందుకే తాజా పండ్లను తినడం మంచిది. దీని వల్ల శరీరానికి విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ పుష్కలంగా అందుతాయి. పండ్లు తినడం వల్ల ఊబకాయం, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు.
శాకాహారంతోనే ఎన్నో లాభాలు
మాంసాహారం కంటే శాకాహారం ఎంతో బెటర్. ఎందుకంటే ఎన్నో రకాల పోషకాలు, ప్రోటీన్స్ పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే బచ్చలికూరతో క్యాన్సర్, గుండె సంబంధిత సమస్యలు, టైప్ 2 డయాబెటిస్ నివారించబడతాయని అంటున్నారు. నానపెట్టిన బాదం, పీనట్ బటర్, ఓట్స్, బ్రౌన్ బ్రెడ్, అరటిపండ్లు రాత్రి 8 తర్వాత తింటే బరువు తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొంటున్నారు.