ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతోన్న ఐదోటెస్టులోనూ భారత్ పట్టు బిగిస్తోంది. అయితే మూడోరోజు ఆట ప్రారంభమైనప్పటి నుంచి భారత సారథి రోహిత్ మాత్రం మైదానంలోకి రాలేదు. దీంతో అతడికి ఏమైందనే ఆందోళన అభిమానుల్లో నెలకొంది. ‘‘వెన్ను నొప్పి కారణంగా రోహిత్ డగౌట్‌కే పరిమితమయ్యాడు’’అని బీసీసీఐ అప్డేట్ ఇచ్చింది. రోహిత్ గైర్హాజరీతో జట్టును వైస్ కెప్టెన్ బుమ్రా నడిపిస్తున్నాడు.