టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చరిత్ర సృష్టించారు. ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్టులో 5 వికెట్లు తీసి, అత్యధికసార్లు(36) ఈ ఘనత సాధించిన భారత బౌలర్‌గా నిలిచారు. ఇక మొత్తం ఐదు వికెట్ల జాబితాలోనూ మూడో స్థానంలో ఉన్న రిచర్డ్ హడ్లీని సమం చేశారు. మరో వికెట్ తీస్తే తన 100వ టెస్టు మ్యాచ్‌లో 10 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా మరో రికార్డు ఖాతాలో వేసుకుంటారు.
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌పై భారత్ 64 పరుగుల తేడాతో విజయం సాధించింది. 259 పరుగుల వెనకంజతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 195 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 5 వికెట్లతో చెలరేగాడు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లో జో రూట్ (84) ఒంటరి పోరాటం చేశాడు.
టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టు మూడో రోజు ఆట ప్రారంభమైంది. ధర్మశాలలో శనివారం 473/8 ఓవర్‌నైట్ స్కోరుతో భారత్ ఆట ప్రారంభించింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ వెన్నునొప్పితో బాధపడుతుండగా, బుమ్రా కేర్‌టేకర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. కాగా, భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 124.1 ఓవర్లలో 477 పరుగులకు ఆలౌటైంది.