ఒకవైపు షేర్ మార్కెట్ లో జోరు కొనసాగుతోంది. మరోవైపు బంగారం కొత్త గరిష్టాలను తాకుతోంది. సాధారణంగా ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది. ప్రస్తుతం బిజినెస్ సెషన్‌లోనూ బంగారం ధర రూ.65000 పైన ట్రేడవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో బంగారం మరింత పెరగవచ్చని భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత బంగారం ధర పది గ్రాములకు రూ.70 వేల వరకు పెరగవచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
బంగారం, వెండికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంటుంది. అయితే, బులియన్ మార్కెట్‌లో గత కొంత కాలం నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. కాగా తాజాగా గోల్డ్, సిల్వర్ రేట్లు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రా. గోల్డ్ పై రూ. 10, కిలో వెండిపై రూ.100 మేర తగ్గింది. సోమవారం (మార్చి 11 2024) నమోదైన ధరల ప్రకారం 22 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.60,740, 24 క్యారెట్ల ధర రూ.66,260 గా ఉంది. వెండి కిలో ధర రూ.75,600గా కొనసాగుతోంది.