రక్తపోటు ఉన్న వారు నిద్రపోయే సమయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. నిద్రలో అతిగా గురక వచ్చినా హై బీపీకి సంకేతమని హెచ్చరిస్తున్నారు. అధిక రక్తపోటు వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తి నిద్రపట్టదని చెబుతున్నారు. రాత్రి పడుకునేటప్పుడు తరచూ తలనొప్పి వేధిస్తుంటే డాక్టర్ ను సంప్రదించాలని, నిద్రలేమి సమస్యలతో తీవ్రమైన అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
రక్తాన్ని శుద్ధి చేసే ఆహారాలు ఇవే
మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలోని రక్తం శుభ్రంగా ఉండడం చాలా ముఖ్యమని వైద్యులు అంటున్నారు. రక్తంలో ఉండే అమైనో ఆమ్లాలు, గ్లూకోజ్, ప్రోటీన్, హార్మోన్లు, ఆక్సిజన్, నీరు వంటి పోషకాల సాయంతో అవయవాలకు శక్తి లభిస్తుంది. మన శరీరంలో రక్తం సహజ సిద్ధంగా శుద్ధి కావాలంటే కొన్ని ఆహారాలు తీసుకోవాలి. ఇందులో ముఖ్యంగా నిమ్మకాయ, అల్లం, బెల్లం, వెల్లుల్లి, పసుపు, యాపిల్, జామ తదితర పండ్లు తినాలని వైద్యులు నిపుణులు సూచిస్తున్నారు.