వేసవిలో నిమ్మరసంలో సబ్జా గింజలు కలిపి తాగుతుంటారు. దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. నానబెట్టిన సబ్జా గింజలు జెల్లీల మాదిరి ఉండడంతో పిల్లలు కూడా వాటిని ఇష్టంగా తాగుతారు. శరీరంలోని కొవ్వును కరిగించడంలో సబ్జా గింజలు దోహపడతాయి. ఇందులో పుష్కలంగా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ జీవక్రియను మెరుగ్గా ఉంచుతాయి. అన్నిటికంటే ముఖ్యంగా శరీరంలో వేడికి తగ్గించడంలో సబ్జా గింజలకు సాటి ఏదీ లేదు.