మరికొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ 15 రోజుల షెడ్యూల్‌ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. పార్లమెంటు ఎన్నికల కారణంగా బీసీసీఐ కేవలం 21 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మాత్రమే విడుదల చేసింది.
ఏప్రిల్, మే నెలల్లో దశలవారీగా ఎన్నికలు ఉన్నందున ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండో దశ మ్యాచ్‌లను విదేశాల్లో నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ను ఖరారు చేసినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, ఇప్పటి వరకు ఐపీఎల్ తొలి దశ షెడ్యూల్‌ను ప్రకటించారు.
చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఈ నెల 22న ఐపీఎల్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. తొలి దశలో ఏప్రిల్ 7 వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి.