ఉలవల్లో పోషకాలు సమృద్ధిగా ఉండటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఉలవలు రెండు రకాలు.. అవి తెల్ల ఉలవలు, నల్ల ఉలవలు. వీటిలో B1, B2, B6, C, E వంటి విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. అనారోగ్య కొవ్వులను తగ్గించడంతోపాటు గుండె జబ్బులకు చెక్ పెడుతాయి. ఉలువల్లోని ఫైబర్ రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంతోపాటు బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది.
బొప్పాయితో బోలెడు ప్రయోజనాలు
రోజువారీ డైట్లో బొప్పాయిని చేర్చుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బొప్పాయి వల్ల జీర్ణక్రియ మెరుగవుతుందని, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుందని అన్నారు. అంతేకాక బొప్పాయి వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం, రోగనిరోధక శక్తిని పెంచడం, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం లాంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు.