ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. రేపు సాయంత్రం 4:10 గంటలకు గన్నవరం చేరుకుంటారు.
అక్కడి నుంచి హెలికాప్టర్‌లో పల్నాడు జిల్లా చిలకలూరిపేట వెళ్తారు. చిలకలూరిపేట మండలంలో జరిగే బీజేపీ-జనసేన-టీడీపీ ఉమ్మడి సభలో ఆయన పాల్గొంటారు. సభ ముగిసిన తర్వాత తిరిగి రాత్రి 7.45 గంటలకు గన్నవరం నుంచి హైదరాబాద్ వెళతారు.