టెస్టు ఫార్మాట్ రిటైర్మెంట్ నుంచి తిరిగి వచ్చి బంగ్లాదేశ్‌తో టెస్టు ఫార్మాట్లో సిరీస్‌లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న శ్రీలంక ఆల్‌రౌండర్ వనిందు హసరంగాకు ఐసీసీ షాకిచ్చింది. రెండు టెస్టుల సస్పెన్షన్‌కు గురయ్యాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో ఫీల్డ్ అంపైర్‌తో దురుసుగా ప్రవర్తించినందుకు అతనికి మూడు డీమెరిట్ పాయింట్లు లభించాయి.
అతని మొత్తం డీమెరిట్ పాయింట్ల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. నిబంధనల ప్రకారం ఐసీసీ వాటిని నాలుగు సస్పెన్షన్ పాయింట్లుగా మార్చింది. తదుపరి రెండు టెస్టుల్లో పాల్గొనకుండా నిషేధం విధించారు. ఈ నేపథ్యంలో హస్రంగ జాతీయ జట్టుకు దూరం కానున్నాడు. ఐపీఎల్ 17వ సీజన్ తొలి మ్యాచ్ నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అందుబాటులో ఉంటాడు.