హోలీ పండుగ రోజున జాగ్రత్తలు పాటించకుంటే చర్మవ్యాధులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. హోలీ రంగుల్లో ఉండే రసాయనాల వల్ల చర్మం దెబ్బతింటుంది. హోలీ ఆడిన తర్వాత కొంతమంది తమ ముఖాన్ని ఫేస్ వాష్తో శుభ్రం చేసుకుంటారు. దీని వల్ల మొటిమల సమస్యలు ఎదురవుతాయి. అందుకే హోలీ ఆడే ముందు చర్మసంరక్షణ కోసం కొబ్బరినూనెను ముఖానికి, జుట్టుకు రాసుకుంటే మంచిదట.
హోలీ పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. అయితే దేశవ్యాప్తంగా ఒక్కరోజే ఉండే ఈ పండుగ.. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని లోక్యతండాలో మూడు రోజులు జరుగుతుంది. గిరిజన సంస్కృతి ఉట్టిపడేలా కోలాటం, కామదహనం, డూండ్, దండామారో, పాగ్రామ్, రంగోలీ పేరుతో ఉత్సవాలు చేస్తారు. ఇలా వందేళ్ల నుంచి చేస్తున్నారు. రాష్ట్రం నలుమూల నుంచి వేలాది మంది గిరిజనుల ఈ ఉత్సవాలకు వస్తారు.