చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్ ధోనీ తప్పుకోవటం పట్ల రోహిత్ శర్మ తన ఇన్‌స్టాలో ఆసక్తికర చిత్రాన్ని పంచుకున్నాడు. ఈ చిత్రంలో ధోనీకి రోహిత్ శర్మ షేక్ హ్యాండ్ ఇచ్చి కాంగ్రాట్స్ చెబుతున్నట్లు ఉంది.
దీనికితోడు క్యాప్షన్‌లో హ్యాండ్‌షేక్ ఎమోజీని కూడా పంచుకున్నాడు. ధోనీ కెప్టెన్సీ నుంచి దిగిపోయిన కాసేపటికే రోహిత్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఈ పోస్ట్ చేశాడు.