ప్రపంచంలో సంచలనం సృష్టించిన OpenAI నుంచి మరో ఆవిష్కరణ వచ్చింది. వ్యక్తుల వాయిస్‌ను క్లోనింగ్ చేసే AI టూల్‌ను కంపెనీ తీసుకొచ్చింది. ఒక వ్యక్తి మాట్లాడే వాయిస్‌ను రికార్డ్ చేసుకుని అచ్చం అతనిలా మాట్లాడుతుంది.
అది కూడా కేవలం 15 సెకన్ల వాయిస్ రికార్డ్ ద్వారా వ్యక్తి వాయిస్‌ను తిరిగి వినిపిస్తుంది. వాయిస్ ఇంజిన్‌గా పిలువబడుతున్న ఇది సాధారణ ప్రజలకు మాత్రం అందుబాటులో ఉండదు. ఎందుకంటే దీనిని దుర్వినియోగ పరిచే అవకాశం ఉందట.