ట్రెండింగ్
Epaper    English    தமிழ்

OnePlus Nord CE 4: లీక్ అయిన ధర వివరాలు

Technology |  Suryaa Desk  | Published : Mon, Apr 01, 2024, 01:39 PM

OnePlus Nord CE 4 ఎట్టకేలకు ఏప్రిల్ 1న అంటే ఈ రోజు సాయంత్రం 6.30 కు భారతదేశంలో లాంచ్ చేయబడుతుంది. 5G తో వచ్చే ఈ మధ్య-శ్రేణి స్మార్ట్‌ఫోన్ పెద్ద డిస్‌ప్లే, కొత్త చిప్‌సెట్ మరియు వేగవంతమైన ఛార్జింగ్ మద్దతుతో భారీ బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.రాబోయే OnePlus ఫోన్ ధర రూ. 30,000 లోపు ఉండవచ్చని అంచనా ఉంది.ఇప్పటి వరకు వచ్చిన లీక్‌లు మరియు కొన్ని ధృవీకరించబడిన నివేదికల వివరాల ఆధారంగా OnePlus Nord CE 4 ఫోన్ గురించి ఇప్పటివరకు మనకు తెలిసిన వివరాలు ఇక్కడ ఇస్తున్నాము


రాబోయే OnePlus Nord CE 4 ధర భారతదేశంలో రూ. 24,999 గా ఉంటుందని టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ పేర్కొన్నారు. ఈ ధర 8GB RAM + 128GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్ కోసం సూచించబడింది. అలాగే, 8GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ.26,999 ఉంటుందని అంచనాలున్నాయి.


 


OnePlus Nord CE 4 యొక్క భారతదేశ ధరలపై ఇంకా అధికారిక ధృవీకరణ ఏదీ లేదు, అయితే ఈ లీక్ లు నిజమని తేలితే, కంపెనీ దాని ముందున్న ధర కంటే తక్కువ ధరకు ఆఫర్ చేస్తుందని అర్థం. గుర్తుకు తెచ్చుకుంటే, OnePlus Nord CE 3 5G భారతదేశంలో 8GB RAM + 128GB నిల్వ కోసం రూ.26,999 కి ప్రకటించబడింది. 12GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ రూ. 28,999 కి విక్రయించబడింది.


 


OnePlus Nord CE 4: లీకైన మరియు ధృవీకరించబడిన ఫీచర్ల వివరాలు


 


OnePlus Nord CE 4 స్మార్ట్ ఫోన్ 6.7 అంగుళాల ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్‌ప్లేతో రావడానికి సిద్ధంగా ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మరియు స్క్రీన్-టు-బాడీ రేషియో 93.4 శాతం. ఈ పరికరం సరికొత్త ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌ని కలిగి ఉందని కంపెనీ నుండి వెల్లడైంది.


 


ఈ 5G పరికరం 8GB LPDDR4x RAM ని ప్యాక్ చేస్తుంది, వర్చువల్ RAM ద్వారా అదనంగా 8GB విస్తరించవచ్చు. ముఖ్యంగా, ఇది 100W సూపర్ ఊక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. 29 నిమిషాల్లో ఈ పరికరాన్ని 1 నుండి 100 శాతం వరకు ఛార్జింగ్ చేయవచ్చు.


 


ఈ ఫోన్ 5,500mAh బ్యాటరీని కలిగి ఉంటుందని లీక్‌లు సూచిస్తున్నాయి. ఇక కెమెరా వివరాలు గమనిస్తే, అంచనాల ప్రకారం 50-మెగాపిక్సెల్ యొక్క ప్రైమరీ రియర్ సెన్సార్, బహుశా సోనీ LYT-600, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) కలిగి ఉంటుంది. దీనితో పాటుగా 8-మెగాపిక్సెల్ సోనీ IMX355 అల్ట్రావైడ్ కెమెరా ఉండవచ్చు. ఇంకా,సెల్ఫీల కోసం, 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా పరికరం యొక్క డిస్‌ప్లే కూడా ఉంటుంది.


 


గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com