మనిషికి నిద్ర చాలా అవసరం. సరైన నిద్రపోయేందుకు మంచి ఆహారం కూడా తీసుకోవాలి. కొన్ని రకాల ఆహారాలు నిద్రను ప్రోత్సహిస్తాయి. అవేంటో ఓసారి చూద్దాం. పాలకూర నిద్రకు సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే పిస్తా, కివీ పండ్లు, డార్క్ చాక్లెట్, వాల్నట్స్, తృణధాన్యాలు తింటే నిద్రకు సహకరిస్తాయని అంటున్నారు. అయితే ఏది తిన్నా నిద్రకు ముందుగానే తినాలని సూచిస్తున్నారు.