చెక్కతో తయారు చేసిన ప్రపంచంలోనే తొలి ఉపగ్రహం లిగ్నోశాట్‌ను జపాన్ శాస్త్రవేత్తలు అక్టోబర్‌లో ప్రయోగించనున్నారు. ఇది భూమి యొక్క వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు పూర్తిగా కాలిపోతుంది. అంతరిక్ష వ్యర్థాలను తగ్గించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఇది అన్ని వైపులా 10CM పొడవుతో మాగ్నోలియా కలపతో తయారు చేయబడింది. ఇది క్యోటో విశ్వవిద్యాలయం మరియు సుమిటోవా ఫారెస్ట్రీ సహకారంతో 2020 నుండి అభివృద్ధి చేయబడుతోంది.