సాధారణంగా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ కాలికి నల్ల దారం కట్టుకోవడం మనం గమనించే ఉంటాం. ఇలా ఎందుకు కట్టుకుంటారు అని అడిగితే దిష్టి తగలకుండా నరదృష్టి నుంచి బయటపడడానికి అనే చాలా మంది చెబుతూ ఉంటారు.అసలు ఈ నల్ల దారాన్ని ఎందుకు కట్టుకుంటారు? స్త్రీ పురుషులు ఏ కాలికి కట్టుకోవాలి? చిన్నపిల్లలు కూడా కట్టుకోవచ్చా ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాలికి నల్ల దారాన్ని ఎవ్వరైనా కట్టుకోవచ్చట. చిన్నా, పెద్దా, స్త్రీ, పురుషులు అని తేడా లేకుండా ఎవ్వరైనా ఈ నల్లదారాన్ని కట్టుకోవచ్చని చెబుతున్నారు పండితులు.
ఈ నల్లదారం కట్టుకోవడం చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. నల్లదారం కట్టుకోవడం వల్ల దిష్టి తగలకుండా వుంటుందట. అయితే పురుషులు నల్ల దారం కట్టుకోవాలనుకుంటే కుడి కాలికి మాత్రమే నల్లదారాన్ని కట్టుకోవాలి. అలాగే స్త్రీలు నల్ల దారం కట్టుకోవాలనుకుంటే ఎడమకాలికి మాత్రమే నల్ల దారాన్ని కట్టుకోవాలని చెబుతున్నారు. అయితే ఎప్పుడు కట్టుకోవాలి అన్న విషయానికి వస్తే.. కేవలం అమావాస్య రోజు మాత్రమే నల్లదారాన్ని కట్టుకోవాలని చెబుతున్నారు పండితులు. అమావాస్య రోజు కట్టుకుంటే మళ్లీ అమావాస్య లోపు ఎలాంటి నరదృష్టి ఉన్న నరగోష ఉన్న ఆ నల్ల దారం మొత్తం ఆకర్షిస్తుందట. కాబట్టి ప్రతీ 30 రోజులకు ఒకసారి నల్ల దారాన్ని మార్చుకోవాలని చెబుతున్నారు.
అలాగే నల్లదారాన్ని ఎప్పుడపడితే అప్పుడు తీసివేయవద్దు. సాయంత్రం సమయంలో మాత్రమే ఈ నల్ల దారాన్ని తీసివేయాలట. నల్లదారాన్ని తీసి, చేతిలో జిల్లేడు ఆకులో కర్పూరం వెలిగించి ఆ కర్పూరంలో వాడిన నల్ల దారాన్ని వేసి కాల్చివేయాలట. ఇలా కాల్చివేసిన నల్లదారాన్ని ఒక కవర్ లో చుట్టి ఎవ్వరూ లేని ప్రదేశంలో పారవేయాలని చెబుతున్నారు పండితులు. అలాగే నల్ల దారాన్ని కట్టుకునేవారు కచ్చితంగా మూడు పోగులు వేసుకొని కట్టుకోవాలట. ఒకసారి కట్టుకున్న నల్ల నల్ల దారాన్ని అమావాస్య నుంచి అమావాస్య వరకు మాత్రమే అనగా 30 రోజులు మాత్రమే కట్టుకోవాలని చెబుతున్నారు. అలాగే చిన్నపిల్లలకు కూడా నల్లదారం కట్టడం వల్ల నరదృష్టి తగలకుండా వుంటుందట. సంవత్సరం పాటు చిన్నపిల్లలకు బుగ్గపై కాటుక చుక్క పెట్టడం వల్ల దృష్టి తగలకుండా వుంటుంది. స్త్రీలు కళ్లకు కాటుక ధరించడం వల్ల ఒకవైపు దృష్టి తగలకుండా వుండడమే కాకుండా కళ్లు చాలా ఆకర్శనియంగా వుంటాయని పండితులు చెబుతున్నారు.