టంగుటూరు పొగాకు వేలం కేంద్రంలో శనివారం నిర్వహించిన వేలంలో పొగాకు అత్యధిక ధర రూ. 365 పలికింది. మల్లవరప్పాడు, శివపురం, గొర్లమిట్ట, మట్టిపాడు, కమ్మవారిపాలెం, కట్టుబడిపాలెం, కారుమంచి గ్రామాలకు చెందిన రైతులు 946 బేళ్లను వేలానికి తీసుకురాగా వాటిలో 824 కొనుగోలు జరగ్గా 122 బేళ్లు తిరస్కరించారు. గరిష్ట ధర రూ. 365 పలకగా, కనిష్ట ధర రూ. 205 పలకగా, సరాసరి రూ. 301. 99 ధర పలికిందని నిర్వహణాధికారి తెలిపారు.