శ్రీలంకతో మూడు టీ 20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు పల్లెకలెలో తొలి మ్యాచ్ జరగునుంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో శుభారంభం చేయాలని భావిస్తోంది. హార్దిక్ పాండ్యాను కాదని టీ 20 విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌కు సారథ్య పగ్గాలు అప్పజెప్పడంపై వివాదం చెలరేగిన వేళ ఈ మ్యాచ్‌తో వాటికి చెక్ పెట్టాలని సూర్య భాయ్ భావిస్తున్నాడు. మరోవైపు సొంత మైదానంలో టీ 20 ప్రపంచ ఛాంపియన్ టీమిండియాకు షాక్ ఇచ్చి శుభారంభం చేయాలని శ్రీలంక కూడా పట్టుదలతో ఉంది.
ఈ సిరీస్‌లో శుభ్‌మన్ గిల్‌తో కలిసి యశస్వీ జైస్వాల్ ఓపెనింగ్ చేయనున్నాడు. తర్వాత రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ రానున్నారు. దీంతో భారత్‌కు లోయర్ ఆర్డర్ వరకూ పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. అయితే సొంత మైదానంలో లంక బౌలర్లను ఎదుర్కోవడం అంత తేలిక కాదు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తే భారత్‌కు తిప్పలు తప్పకపోవచ్చు. అలాగే అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, ఖలీల్ మహ్మద్, సిరాజ్‌లతో కూడిన బౌలింగ్ లైనప్ కూడా పర్వాలేదనిపిస్తోంది.