శ్రీలంకతో జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్‌లో ఇండియా ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది. తొలుత మ్యాచ్ టై కాగా, ఆ తర్వాత సూపర్ ఓవర్ ద్వారా ఇండియా గెలిచింది.138 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన శ్రీలంక.. చివరి ఓవర్లో గెలుపు కోసం ఆరు రన్స్ మాత్రం చేయాల్సి ఉంది. అయితే ఆ సమయంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అనూహ్య రీతిలో బౌలింగ్ చేశాడు. స్పిన్‌కు అనుకూలిస్తున్న ఆ పిచ్‌పై సూర్య అద్భుతంగా బౌల్ చేశాడు. అయిదు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. స్కోర్లు సమం కావడంతో.. మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లింది.ఇక సూపర్ ఓవర్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన శ్రీలంక కేవలం రెండు రన్స్ మాత్రమే చేసింది. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ తొలి బంతికి ఫోర్ కొట్టి .. జట్టుకు విజయాన్ని అందించాడు.