గత కొంతకాలంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో 5G స్మార్ట్‌ఫోన్ల వహా నడుస్తుంది. టెక్ కంపెనీలు ఈ సెగ్మెంట్‌లో భారీగా పోటీపడుతున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ పోటీలోకి టెలికాం దిగ్గజం జియో కూడా ఎంట్రీ ఇచ్చింది. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సత్తా చాటేందుకు సిద్దమైంది. ప్రీమియం ఫీచర్లతో 5G ఫోన్ తీసుకురానుంది. దీని ధర చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. రిలయన్స్ జియో త్వరలో కొత్త Jio Bharat 1 5G స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేయనుంది. ఫోన్ ధర నుండి కొన్ని ప్రత్యేక ఫీచర్లు ఇప్పటికే లీక్ అయ్యాయి. ఫీచర్లను చూస్తుంటే స్మార్ట్‌ఫోన్ చాలా పెద్ద కంపెనీలకు సమస్యలను సృష్టించే అవకాశం ఉందని తెలుస్తోంది. అతి తక్కువ ధరకే ఈ ఫోన్ రూ.5,999 అందుబాటులోకి రానుంది. ఫోన్‌లో హై రిసొల్యూషన్ కెమెరా ఉండే అవకాశం ఉంది. జియో ఈ రాబోయే కొత్త 5G స్మార్ట్‌ఫోన్ గొప్ప డిజైన్‌తో రాబోతోంది. ఇందులో మీరు 6.7 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను ఉండొచ్చని సమాచారం. సూపర్ AMOLED డిస్‌ప్లేలో క్లిస్టర్ క్లియర్ వీడియాలను చూడొచ్చు. ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. దీని కారణంగా మీరు స్మూత్ టచ్‌ఫీల్‌ని పొందుతారు.
ఫోటోగ్రఫీని ఇష్టపడే వ్యక్తులు ఈ ఫోన్‌తో అద్భుతమైన ఫోటోలను క్యాప్చర్ చేయవచ్చు. ఫోన్ 12,32 లేదా 50MP కాకుండా 100MP ప్రైమరీ కెమెరా సెటప్‌తో వచ్చే అవకాశం ఉంది. ఇది కాకుండా ఫోన్‌లో 16MPఅల్ట్రా వైడ్ కెమెరాను చూడవచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం ఫోన్‌లో 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. ఫోన్‌లో 6700mAh బ్యాటరీ ఉంది. ఇది 120వాట్ల సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. జియో ఈ చీపెస్ట్ 5G ఫోన్ మూడు ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌లలో వచ్చే అవకాశం ఉంది. అందులో 8GB RAM+128GB, 12GB RAM + 256GB, 16GB RAM + 512 GB ఉన్నాయి. Jio Bharat 1 5G లాంచ్‌కు సంబంధించి కంపెనీ ఎటువంటి సమాచారాన్ని అధికారికంగా వెల్లడించలేదు. ఈ ఫోన్‌ను ఈ సంవత్సరం చివరిలో టెక్ మార్కెట్‌లోకి తీసుకొచ్చే అవకాశం ఉందని లీక్స్ వస్తున్నాయి. వాటి ఆధారంగా జియో ఫోన్ ధర రూ. 5999 నుండి రూ. 6999 మధ్య ఉండే అవకాశం ఉంది.