భారతదేశంలో టెలికం కంపెనీలు ఇటీవల కాలంలో రీచార్జ్ ప్లాన్స్ ధరలు బాగా పెంచాయి. ముఖ్యంగా జియో, ఎయిర్‌టెల్, వీఐ వంటి సంస్థలు ఏకంగా 30 శాతం వరకు ధరలను పెంచాయి. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా వినియోగించే నెలవారీ రీచార్జ్ ధరలు ఇంచుమించు రూ.100 వరకు పెరగడంతో మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ ద్వారా ఇతర నెట్‌వర్క్‌ల వైపు చూస్తున్నారు. ముఖ్యంగా ఎయిర్‌టెల్ వినియోగదారులు పెద్ద సంఖ్యలో ఇతర కంపెనీలకు ఎంఎన్‌పీ వైపు మొగ్గు చూపడంతో ఎయిర్‌టెల్ వినియోగదారులను కాపాడుకునేందుకు దిద్దుబాటు చర్యలను తీసుకుంది. ముఖ్యంగా నెలవారీ రీచార్జ్ ప్లాన్ ధరలను సవరించింది. ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ రెండింట్లో రీచార్జ్ ధరలను సవరించింది. ఎయిర్‌టెల్ రీచార్జ్ ధరల గురించి వివరాలను తెలుసుకుందాం.
ఎయిర్‌టెల్ ఎంట్రీ లెవెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ రిటైల్ కస్టమర్‌లకు నెలవారీ అద్దె రుసుము రూ. 449తో అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్స్‌తో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను అందిస్తుంది. అలాగే 200 జీబీ వరకు రోల్‌ఓవర్‌తో 50 జీబీ నెలవారీ డేటా అందిస్తుంది. అలాగే కస్టమర్‌లు 5 జీ కవరేజీ ఉన్న ప్రాంతాల్లో కాంప్లిమెంటరీ అపరిమిత 5 జీ డేటా ప్రయోజనాన్ని పొందవచ్చు. అలాగే కస్టమర్‌లు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా 3 నెలల పాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. అలాగే అదనంగా రూ. 349తో ప్లాన్‌కు కుటుంబ కనెక్షన్‌లను జోడించే అవకాశం కూడా ఉంది.