ఒలింపిక్స్‌లో బంగారు పతకాలు పూర్తిగా బంగారంతో తయారు చేయబడవు. 529 గ్రాముల బరువున్న ఈ పతకంలో అసలు బంగారం 6 గ్రాములు (1.3%) మాత్రమే ఉంటుంది. మిగిలినది వెండితో చేయబడింది. పతకం పైన బంగారు పొర ఉంటుంది. పారిస్ ఒలింపిక్స్ 2024 బంగారు పతకంలో 6 గ్రాముల బంగారంతో పాటు ఐఫిల్ టవర్ నుంచి సేకరించిన ఇనుము ముక్కల్ని సైతం పొందుపరిచారు. చివరిగా 1912 ఒలింపిక్స్‌లో పూర్తిగా బంగారంతో చేసిన పతకాలను అందించారు.