గోరంట్ల మండలం మల్లాపల్లి పంచాయతీ పరిధిలోని బుగానపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త చాకలి నారాయణప్ప గడ్డివాముకు నిన్నటి రోజు రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు.
బుధవారం విషయం తెలుసుకున్న మంత్రి సవిత చరవాణి ద్వారా చాకలి నారాయణప్ప ని పరామర్శించారు. ఈ సందర్బంగా టీడీపీ నాయకులు రూ 20, 000 ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులుపాల్గొన్నారు.